నిజం తెలుసుకున్న ముకుంద ఏం చేయనుంది!
on Jun 19, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌లో కృష్ణ, మురారి కలిసి లంచ్ కి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. ఇప్పటిదాకా మాములుగా సాగిపోతున్న ఈ సీరియల్ ఇక్కడి నుండి మరో మలుపుకు తీసుకుంది. ఈ మలుపుకు కారణం ఎవరు? ఏం జరగనుందో ఒకసారి చూసేద్దాం.
ఈ సీరియల్ కథలో మురారి, ముకుంద మొదట ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరు విడిపోతారు. అయితే మరోవైపు కృష్ణ వాళ్ళ నాన్న ఏసీపీ మురారి కింద హెడ్ కానిస్టేబుల్ గా ఉండేవాడు. ఒక కేస్ ని సాల్వ్ చేసే క్రమంలో కృష్ణ కళ్ళ ముందే వాళ్ళ నాన్నని మురారి కాల్చేస్తాడు. అతను చనిపోతాడు. అయితే చనిపోయేముందు కృష్ణ వాళ్ళ నాన్న మురారి దగ్గర ప్రామిస్ తీసుకుంటాడు. అదేంటంటే తన కూతురిని పెళ్ళి చేసుకోమని మురారితో చెప్తాడు కృష్ణ వాళ్ల నాన్న. ఆ విధంగా కృష్ణ, మురారిల పెళ్ళి జరుగుతుంది.
అయితే మురారి వాళ్ళ పెద్దమ్మకి కృష్ణ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే తనొక అడవి పిల్ల, తింగరిపిల్ల అందులోను చదువుకోలేదని తనని ఇష్టపడదు. దాంతో కృష్ణ ఇంట్లో ఏం చేసిన ఒప్పకోదు. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్‌లలో కృష్ణ, మురారీలది అగ్రిమెంట్ మ్యారేజ్ కాదనే విషయాన్ని రేవతికి ముకుంద చెప్తుంది. దాంతో కృష్ణ, మురారీలు కలవాలని వాళ్ళ అగ్రిమెంట్ మ్యారేజ్ ని శాశ్వతంగా కలిసి ఉండేలా చేయాలమి భావించిన రేవతి హోమం జరిపిస్తుంది. మరోవైపు ముకుంద తనలో తనే బాధపడుతుంది.
తాజాగా విడుదలైన ఈ సీరియల్ ప్రోమోలో కృష్ణ కోసం మురారీ ఫార్మల్ గా రెడీ అయి వెళ్తాడు. అక్కడ మురారీ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను కలవడంతో అతనితో మాట్లాడుతుంటాడు. అదే సమయంలో ముకుంద అక్కడికి వస్తుంది. చాటుగా వాళ్ళిద్దరు కలిసి ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంది ముకుంద. "కృష్ణని ప్రేమిస్తున్న అనే విషయం ఇంకెప్పుడు చెప్తావ్ రా" అని మురారిని వాళ్ళ ఫ్రెండ్ అడుగగా.. "ఈ రోజు ఎలాగైనా నా మనసులో మాట కృష్ణతో చెప్పేస్తాను రా" అని మురారి అంటాడు.
ఈ మాటలు విన్న ముకుందకి ఒక్కసారిగా గుండె పగిలినట్టుగా అనిపిస్తుంది. ఇన్నిరోజులు మురారి తననే ప్రేమిస్తున్నాడని భావించిన ముకుందకి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అయితే మరి కృష్ణకి మురారి ప్రపోజ్ చేస్తాడా? కృష్ణని మురారి ప్రేమిస్తున్న విషయం తెలుసుకున్న ముకుంద ఏం చేయనుంది? ఇలాంటి అంశాలతో ఈ సీరియల్ మరింత ఆసక్తికరంగా సాగుతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
